– వర్షం సమయంలో సర్‌చార్జీ
బెంగళూరు: వర్షం పడుతుందిగా.. వేడి వేడిగా ఏమైనా తిందామని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే బిల్లు వాచిపోనుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కొత్త రకం చార్జీలను ప్రవేశపెట్టాయి. వర్షం పడుతోన్న సమయంలో ఇకపై స్విగ్గీ వన్, జొమాటోలో ఆర్డర్ చేస్తే అదనంగా రూ.15 నుంచి రూ.30 వరకు సర్‌చార్జీ విధించాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. గోల్డ్ చందాదారులు కూడా ఈ అదనపు రుసుము భరించాల్సి ఉంటుందని వెల్లడించాయి. స్విగ్గీ తన కస్టమర్లకు మెరుగైన సేవలు, సౌలభ్యం కోరుకొనే వినియోగదారుల కోసం ‘స్విగ్గీ వన్’ పేరిట, జొమాటో ‘జొమాటో గోల్డ్ ‘ పేరిట సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తోంది. వీటిని కొనుగోలు చేసిన వారికి ఇరు సంస్థలు పలు ప్రత్యేక ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. వాటిలో రెయిన్ సర్‌ఛార్జీ కూడా ఒకటి. అయితే తాజాగా ఈ సదుపాయాన్ని చందాదారులకు తొలగించినట్టు రిపోర్టులు వస్తోన్నాయి.
స్విగ్గీ, జొమాటో కొత్త బాదుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES