Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఈఎంఆర్‌ఎస్‌ విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు

తెలంగాణ ఈఎంఆర్‌ఎస్‌ విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాలుగవ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2025లో ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ను సాధించిన తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల (ఈఎంఆర్‌ఎస్‌) విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఆ ఈవెంట్‌లో విద్యార్థులు రికార్డ్‌ బ్రేకింగ్‌ మెడల్స్‌ సాధించారు. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, స్విమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌, బాక్సింగ్‌, జూడో, రెజ్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, తైక్వాండో, యోగా, షూటింగ్‌, చెస్‌ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధికంగా 230 పతకాలను తెలంగాణ సాధించింది. నవంబర్‌ 15న ఒడిశాలో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 499 ఈఎంఆర్‌ఎస్‌ సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 22 ఈవెంట్లలో నిర్వహించిన పోటీల్లో వ్యక్తిగత ఈవెంట్లు 15, జట్టు ఈవెంట్లు 7 ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి జాతీయ ఈవెంట్‌లో 23 పాఠశాలలకు చెందిన 580 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. మొత్తం 714 పాయింట్లతో తెలంగాణ విద్యార్థులు ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్నారు. వారి ప్రతిభను గుర్తించిన గిరిజన శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ విద్యార్థులకు పూర్తి సహకారం ఉంటుందని భరోసానిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -