నవతెలంగాణ – హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసకందాయంలో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 164 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఫస్ట్ ఇన్సింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకుని ఆస్ట్రేలియాకు 205 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది. ఇంగ్లాండ్ బాట్స్‌మెన్లలో గస్ అట్కిస్సన్ 37, బెన్ డకెట్ (28), ఓలీ పోప్ 33, బ్రైడన్ కార్స్ 20 మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక కంగారు బౌలర్లలో బోల్యాండ్ 4, మిచెల్ స్టార్క్, బ్రైడెన్ డొగ్గెట్ చెరో 3 వికెట్లు పడొగొట్టారు. టీ విరామం ముగిసేసరికి ఆసిస్ వికెట్లు ఏమి కోల్పోకుండా 3 పరుగులు చేసింది. క్రీజ్‌లో జాకీ విథెరాల్డ్ (0), ట్రావీస్ హెడ్ (3) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ముగిసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్..ఆస్ట్రేలియా లక్ష్యం 205
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



