- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈరోజు నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లను ఆరు నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం 29 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఇక, జూన్ 3న ఫైనల్ జరగనుంది. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ రీస్టార్ట్ కానుంది.
- Advertisement -