Sunday, November 23, 2025
E-PAPER
Homeజాతీయంమరో ఘోర బస్సుకు ప్రమాదం..

మరో ఘోర బస్సుకు ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ నంద్యాల: నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ సమీపంలో మైత్రి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆ వెంటనే వెనకాల వస్తున్న మరో లారీ ఆగిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వెనుకభాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాద జరిగింది. బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి.

క్షతగాత్రులను మూడు 108 వాహనాల్లో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులో వెనుకవైపు కూర్చొన్న ఇద్దరు అందులోని ఇరుక్కుని మృతి చెందగా వారి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఇరుక్కున్న లారీ డ్రైవరును అతి కష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -