Saturday, May 17, 2025
Homeజాతీయంబీహార్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఆ ప్రాంత పేరు మార్పు

బీహార్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఆ ప్రాంత పేరు మార్పు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:
బీహార్‌లోని నితిష్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ముఖ చారిత్ర‌క‌ ప్రాంతం గ‌య పేరును గ‌య‌జీ గా మార్పు చేస్తు ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఈ మేర‌కు చీప్ సెక్ర‌ట‌రీ సిద్ధార్థ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. స్థానిక భావాలు., చారిత్రక నేప‌థ్యం, మతపరమైన ప్రాముఖ్యత త‌దిత‌ర అంశాలను దృష్టిలో ఉంచుకొని గ‌య పేరు మార్చిన‌ట్టు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

గయ, హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాష్టంలో గయ జిల్లాలో ముఖ్యపట్టణం. రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. గయ చారిత్రాత్మక మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గయ చరిత్ర గౌతమబుద్ధుడు జన్మించిన తరువాత చరిత్రపుటలలోకి ఎక్కింది. గయకు 11 కిలోమీటర్లదూరంలో బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన బోధగయ ఉంది. ప్ర‌తి ఏటా బుద్ద‌ పౌర్ణ‌మి నాడు బౌద్ద‌
బిక్షువులు ఇక్క‌డి వ‌చ్చి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -