నవతెలంగాణ – హైదరాబాద్: పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ అవుతోంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లను ఆరు నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్,ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉన్నట్లు సమాచారం. కానీ, చిన్నస్వామి స్టేడియంలో అత్యున్న డ్రైనేజీ వ్యవస్థ ఉండటం అనేది కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ మ్యాచ్‌కు వరుణుడు కరుణిస్తే ఐపీఎల్ రీస్టార్ట్ ఘనంగా జరుగుతుంది. అందుకే అభిమానులు వరుణ దేవుడిని ఇవాళ కరుణించాలని ప్రార్థిస్తున్నారు.
నేడు కేకేఆర్,ఆర్‌సీబీ మ్యాచ్.. వరుణుడు కరుణిస్తాడా..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES