- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. రిజర్వేషన్ల జాబితాల పునఃపరిశీలన పూర్తయింది. ఎన్నికల నిర్వహణపై మరికొన్ని గంటల్లో హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూలు, నోటిఫికేషన్‌పై SEC నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 25న కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను SEC ఆదేశించింది.
- Advertisement -



