- Advertisement -
ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ
నవతెలంగాణ-హైదరాబాద్: PSLV-C61 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7.59 గంటల నుంచి 22 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 5:59 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు, కీలకమైన మౌలిక సదుపాయల కల్పనకు దోపదపడేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహంలో సీ-బ్యాడ్ సింథటిక్ అపార్చర్ రాడార్‌ను అమర్చారు. ఉగ్రశిబిరాలు, కార్యకలాపాలను కూడా తెలుసుకోనున్నారు.అలాగే సరిహద్దులో సైనికుల కదిలకలను కూడా ఈ ఉపగ్రహం ద్వారా సమాచారం తెలుసుకోనున్నారు. దీని ద్వారా పగలు, రాత్రి సమయంలో వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటారు.
- Advertisement -