Monday, November 24, 2025
E-PAPER
Homeఆటలుస్మృతి మంధాన కాబోయే భర్తకు అస్వస్థత

స్మృతి మంధాన కాబోయే భర్తకు అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అస్వస్థతతో ఆసుపత్రి పాలవడంతో ఆదివారం జరగాల్సిన ఆమె వివాహం అగిపోయిన విషయం తెలిసిందే. వివాహ వేడుకలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన్న ఛాతి నొప్పితో ఇబ్బంది పడ్డారు. గుండె పోటు లక్షణాలు కనిపించడంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి అనారోగ్యం కారణంగా వివాహ తంతును కొనసాగించేందుకు స్మృతి అంగీకరించలేదు. దీంతో వివాహం వాయిదా పడింది. ఓవైపు తండ్రి ఆసుపత్రిలో చేరగా.. ఆ తర్వాత కాసేపటికి స్మృతి కాబోయే భర్త పలాశ్ ముచ్ఛల్ కూడా అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వైరల్ ఇన్ఫెక్షన్ తో అనారోగ్యంపాలైన పలాశ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఆయన అనారోగ్యం ప్రమాదకరమైనదేమీ కాదని, చికిత్స తర్వాత వెంటనే పలాశ్ ను డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -