Monday, November 24, 2025
E-PAPER
Homeక్రైమ్మెదక్ లో వాగులోకి దూసుకెళ్లిన భారీ కంటైనర్

మెదక్ లో వాగులోకి దూసుకెళ్లిన భారీ కంటైనర్

- Advertisement -

నవతెలంగాణ తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద భారీ కంటైనర్ లారీ అదుపుతప్పి హల్దీ వాగులోకి దూసుకెళ్లింది. 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై నాగపుర్ నుంచి హైదరాబాద్ వైపు వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హల్దీవాగు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో.. పూర్తిగా వాగులోకి కంటైనర్ దూసుకెళ్లకుండా భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ భీమల్ యాదవ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -