- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండలంలోని కమల్ పూర్ పంచాయతీ పరిధిలో నూకల చింతవాడిక తండాలో సింగిల్ ఫేస్ బోరు మోటరు చెడిపోయింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు కేతావత్ రవికుమార్ తన సొంత ఖర్చులతో బోరు మోటర్ ను మరమ్మత్తులు చేసి, తాగునీటి సమస్య పరిష్కరించారు. అదేవిధంగా తండాలో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. తమ తాండ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో తండవాసులు పాల్గొన్నారు.
- Advertisement -



