Monday, November 24, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో పడిపోయిన ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య

బీహార్‌లో పడిపోయిన ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య

- Advertisement -

నవతెలంగాణ పాట్నా : 2025లో బీహార్‌లో ఎన్నికైన ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య11కి పడిపోయింది. అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ముస్లిం ఎమ్మెల్యేల వాటా 4.5శాతానికి క్షీణించిందని, 2000 తర్వాత ఇప్పుడు అత్యల్ప ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. 2025లో బీహార్‌లో ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య 11 కాగా, ఇది సంవత్సరాల్లో అత్యల్పం. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 42శాతం తగ్గుదల. ఆ ఎన్నికల్లో 19 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తర్వాత ఇప్పుడు అత్యల్ప ముస్లిం ఎమ్మెల్యేలను కలిగి ఉండటం గమనార్హం.

2022 బీహార్‌ కుల (జన)గణన లెక్కల ప్రకారం.. బీహార్‌ జనాభాలో ముస్లింలు 17.7శాతం ఉన్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీలో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. అంటే వారి సభ్యుల్లో 10శాతం కంటే తక్కువ మంది ఉన్నారు. 243 మంది సభ్యులున్న సభలో ముస్లిం ఎమ్మెల్యేలు 4.5శాతానికి పడిపోయి .. కనిష్ట స్థాయికి చేరుకుంది.

పదిమంది ముస్లిం ఎమ్మెల్యేలను ఎఐఎంఐఎం బరిలోకి దింపగా.. ఐదుగురు విజయం సాధించారు. ఆర్‌జెడి, కాంగ్రెస్‌ల నుండి వరుసగా ముగ్గురు మరియు ఇద్దరు ఎన్నికైన ప్రతినిధులు ఉన్నారు. ఎండి.జమాఖాన్‌ అధికారిక కూటమి జెడి(యు) తరపున గెలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -