- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన గొర్ల కాపరి సుధాకర్ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో తన గొర్లను కాపాడుకునే ప్రయత్నంలో చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకొని వెంటనే వారి కుటుంబ సభ్యులను ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 90 గొర్లకు, వాళ్ల కుటుంబానికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



