Saturday, May 17, 2025
Homeజాతీయంపాక్‌కు గూఢ‌చార్యం..దేవేంద్రసింగ్‌ అనే వ్యక్తి అరెస్ట్‌

పాక్‌కు గూఢ‌చార్యం..దేవేంద్రసింగ్‌ అనే వ్యక్తి అరెస్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భార‌త్‌లో ఉంటూ పాక్‌కు గూఢ‌చార్యం చేస్తున్న హ‌ర్యానాలో ఓ యువ‌కుని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌-పాకిస్థాన్‌ ఘర్షణల సమయంలో పాకిస్థాన్‌ సైన్యానికి, దాని గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి కీలక సమాచారం అందించినందుకు… దేవేంద్రసింగ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ కైతాల్‌ వీర్భన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దేవేంద్రసింగ్‌ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతున్నాడని, ఐఎస్‌ఐకి సమాచారం అందించినట్లు గుర్తించామన్నారు. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. హనీట్రాప్‌ ద్వారా దేవేంద్ర సింగ్‌ను పాకిస్తాన్‌ నిఘాసంస్థ ఐఎస్‌ఐ తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఫోన్‌ స్వాధీనం చేసుకుని, బ్యాంకు ఖాతాల పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -