- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. చార్‌థామ్ యాత్రలో భాగంగా ఎయిమ్స్ రిషికేశ్ హెలీ ఎయిర్ అంబులెన్స్ సాంకేతికగా లోపంతో ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో హెలికాప్టర్ వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఓ వైద్యుడు, కెప్టెన్, వైద్య సిబ్బంది మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆ ముగ్గురికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -