- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై హింస విస్తృతంగా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించిది. 15-49 ఏండ్ల మహిళల్లో 8.4% మంది భాగస్వామి నుంచి లైంగిక హింసకు గురయ్యారని నివేదిక చెబుతుంది.
భారతదేశంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2030 నాటికి హింసను నిర్మూలించే లక్ష్యంపై స్పష్టత లేదని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఆత్మహత్యలను నివారించడంలో వ్యవస్థల వైఫల్యం, యువత ఒంటరితనం, నిస్సహాయత వంటి సమస్యలను పరిష్కరించాలి అని నివేదిక పేర్కొంది. ప్రభుత్వాలు అవగాహన పెంచి, నిధులు కేటాయించాలని సూచించింది.
- Advertisement -



