Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేడు రవీంద్రభారతిలో స్వరాభిషేకం

నేడు రవీంద్రభారతిలో స్వరాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: సుస్వరవాహిని సాంస్కృతిక కళా సంస్థ ఆధ్వర్యంలో స్వరాభిషేకం – 8 పేరుతో అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు నివాళులర్పిస్తున్నారు. వేలాది బాలు పాటల్లో నుండి కొన్ని పాటలను ఎంపిక చేసి, ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో సంస్థ వ్యవస్థాపక గాయకుడు అమీన్ పాషా, డి. మిత్ర, గాయత్రి నారాయణన్, నాదప్రియ, శారదా రాజా తమ గానంతో అలరిస్తారు.

రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, విశిష్ట అతిధిగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ పాల్గొంటారు. ప్రముఖ కవి, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -