Tuesday, November 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనెతన్యాహు భారత్‌ పర్యటన ర‌ద్దు

నెతన్యాహు భారత్‌ పర్యటన ర‌ద్దు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌ పర్యటన మరోసారి రద్దయింది. ఇటీవల ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లతో దేశంలో భద్రతా పరిస్థితులు సున్నితంగా మారిన నేపథ్యంలో … ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాది నెతన్యాహు పర్యటన రద్దవడం ఇది మూడో సందర్భం కావడం విశేషం. నెతన్యాహు ఈ సంవత్సరం చివరిలో భారత్‌ను సందర్శించాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, ఎర్రకోట బాంబు దాడి నేపథ్యంలో ఆయన షెడ్యూల్‌లో మార్పు చేశారు. అంతకుముందు సెప్టెంబర్‌ 19 న జరగాల్సిన ఒక రోజు పర్యటనను కూడా రద్దు చేసిన సంగతి విదితమే. అదేవిధంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ముందుగా నిర్ణయించిన పర్యటన కూడా వాయిదా పడింది. బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌కు చివరిసారిగా 2018లో వచ్చారు. అయితే 2026లో నెతన్యాహు భారత్‌కు చేరుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు విస్ఫోటంలో 13 మంది మరణించగా, అనేక మంది గాయపడిన విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -