Saturday, May 17, 2025
Homeట్రెండింగ్ న్యూస్గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్..

గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విండోస్, మ్యాక్, లైనక్స్‌లోని క్రోమ్‌లో భద్రతాపరమైన లోపాలున్నట్లు గుర్తించింది. వెంటనే ఈ యూజర్లందరూ తమ క్రోమ్‌ను అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది. లేదంటే మీ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In రెస్పాన్స్ టీమ్ ప్రకారం.. విండోస్, మ్యాక్ డివైజ్‌ల్లో 136.0.7103.113/.114, లైనెక్స్ కోసం 136.0.7103.113 కన్నా ముందు ఉన్న క్రోమ్ వెర్షన్‌లలో అనేక సెక్యూరిటీపరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాల కారణంగా ఆయా డివైస్‌లు సులభంగా హ్యాకర్ల అధీనంలోకి వెళ్లిపోతాయని, వాటిలోని సమాచారం హ్యాకర్ల పరమవుతుందని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -