నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. 26/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీల జట్టు 260/5 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 కలిపి టీమ్ఇండియాకు 549 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. ఆట ముగిసే సమయానికి భారత్ 27/2 స్కోరుతో ఉంది. సాయి సుదర్శన్ (2), నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన కుల్‌దీప్ యాదవ్ (4) క్రీజులో ఉన్నారు. ఇంకా ఒక్క రోజు ఆట మిగిలి ఉండగా.. టీమ్ఇండియా 522 పరుగుల వెనుకంజలో ఉంది. ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (6), యశస్వి జైస్వాల్ (13) వికెట్లను భారత్ కోల్పోయింది. జైస్వాల్‌ను యాన్సెన్ ఔట్ చేయగా.. రాహుల్‌ని సైమన్ హార్మర్ తన తొలి ఓవర్‌లోనే క్లీన్‌బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయగా.. భారత్ 201కే ఆలౌటైన సంగతి తెలిసిందే.
నాలుగో రోజు ముగిసిన ఆట..ఓటమి దిశగా టీమ్ఇండియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



