Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు  దరఖాస్తు ఆహ్వానం....

కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు  దరఖాస్తు ఆహ్వానం….

- Advertisement -
  • – జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి వసంత కుమారి….
  • నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
  • కార్పోరేట్ కళాశాలలో విద్యార్ధులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులములు అభివృద్ధి అధికారి డీకే వసంతకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో 2025, ఏప్రిల్ మాసములో 10వ, తరగతి ఉత్తీర్ణులై జి.పి.ఏ. 7 గ్రేడ్ / (400) మార్కులకు పైబడి లేదా సమానముగా ఉన్న యస్.సి., యస్.టి., బి.సి., ఇ.బి.సి., మైనారిటి, వికలాంగుల విద్యార్ధినీ / విద్యార్ధుల నుండి 2025-26 సంవత్సరమునకు గాను కార్పొరేట్ కళాశాలల యందు అడ్మిషన్ కొరకు  ఈనెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యార్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలని కోరారు.  విద్యార్ధినీ / విద్యార్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనేటప్పుడు అవసరమైన  ధృవపత్రములను  స్కాన్ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని,  విద్యార్ధులు వారి ధరఖాస్తును ఆన్ లైన్ లో https://telanganaepass.cgg.gov.in అను వెబ్ సైట్ నందు నమోదు చేసుకొనవలెను. అన్ని ధృవీకరణ పత్రములు తప్పని సరిగా కలిగి ఉండాలన్నారు. ఏ ధృవీకరణ పత్రము లేకున్నాఅడ్మిషన్ ఇవ్వబడదని, పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్  కులముల అభివృద్ధి అధికారి కార్యాలయమును సంప్రదించాలని కోరారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -