Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంముంబై ఎయిర్‌పోర్టులో రూ. 39 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ముంబై ఎయిర్‌పోర్టులో రూ. 39 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడటం కలకలం సృష్టించింది. కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ. 39 కోట్ల విలువైన 39 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇటీవల కాలంలో ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుబడిన అతిపెద్ద గంజాయి రవాణా కేసుల్లో ఒకటిగా నిలుస్తోంది.

బ్యాంకాక్ నుంచి ముంబైకి ఈ భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ విలువ కలిగి ఉందని, ఇది ఎయిర్‌పోర్ట్ ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఎంత విస్తృతంగా జరుగుతుందో తెలియజేస్తోందని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు, ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -