Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి, నర్సాపూర్ గ్రామాల్లో బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. చౌట్ పల్లి గ్రామానికి చెందిన నాగుల ప్రదీప్ వాళ్ళ పెద్ద నాన్న, పెద్ద నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన పల్లపు మహేష్ వాళ్ళ తాత ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. అనంతరం నర్సాపూర్ గ్రామానికి చెందిన రమేష్ ఇటీవల గల్ఫ్ దేశం దుబాయ్ లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సునీల్ కుమార్ మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని తెలిపారు. గల్ఫ్ మృతుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని స్థానిక కాంగ్రెస్ నాయకులు అడిగి తెలుసుకుని, అండగా ఉంటామని హామీలు ఇచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల  ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -