Thursday, November 27, 2025
E-PAPER
Homeజాతీయంమ్యాగెట్‌ పథకానికి రూ.7,280 కోట్లు

మ్యాగెట్‌ పథకానికి రూ.7,280 కోట్లు

- Advertisement -

పూణే మెట్రో రైలు రెండో దశకు రూ.9,858 కోట్లు
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

రేర్‌ ఎర్త్‌ మ్యాగెట్‌ ప్రొడక్షన్‌ (ఆర్‌ఈఎంఫఈ)కు రూ.7,280 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను\ వెల్లడించారు. పుణే నగరంలో మెట్రో రైలు (రెండో దశ) పొడిగింపునకు రూ.9,858 కోట్లు కేటాయించినట్టు వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో దేవభూమి ద్వారక – కర్నాలస్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందన్నారు. అందుకు రూ.1,457 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. బద్లాపూర్‌ – కర్జాత్‌ థర్డ్‌, ఫోర్త్‌ రైల్వే పనులకు సైతం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబాయి సమీపంలోని బద్లాపూర్‌ – కర్జాత్‌ లైన్‌, గుజరాత్‌లోని ద్వారకా లైన్‌లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ద్వారా లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రయోజం చేకూరుతుందన్నారు. అలాగే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. పుణే మెట్రోకు కేంద్రం రూ. 9,858 కోట్లు గ్రాంట్‌ను అందించనుందన్నారు. దీనిద్వారా 32 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌ వేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ మార్గం ఖరడి నుంచి ఖడక్వాస్లా వరకు, నల్‌ స్టాప్‌ నుంచి మాణిక్‌ బాగ్‌ వరకు ఈ మెట్ర రైలు నడవనుందన్నారు. ట్రాఫిక్‌ జామ్‌తో నిత్య నరకం చూస్తున్న పుణే వాసులకు ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి.. స్వదేశంలోనే దీనిని అభివృద్ధి చేసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దాంతో రేర్‌ ఎర్త్‌ మ్యాగెట్‌ ప్రొడక్షన్‌ (ఆర్‌ఈఎంపీ) పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 7,280 కోట్లు కేటాయించింది. భారత్‌లో హైటెక్‌ మాగెట్లను తయారు చేయడమే దీని లక్ష్యం. ఈ మాగెట్లను ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్లలో ఉపయోగిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -