- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సర్పంచ్ ఎన్నికల తొలి విడత షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి గ్రామ పంచాయతీల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించి, 30న పరిశీలన జరగనుంది. డిసెంబర్ 2న ఫిర్యాదుల పరిశీలన, 3న ఉపసంహరణ అనంతరం తుది జాబితా, గుర్తులు విడుదల చేస్తారు. జనరల్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థులకు రూ.2,000, ఎస్సీ–ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000 రుసుము వసూలు చేయనున్నారు.
- Advertisement -



