- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పించొచ్చు. ఈ నెల 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. తొలిదశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
- Advertisement -



