నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. గురువారం ప్రజాభవన్‌లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సీఎస్ రామకృష్ణ రావు హాజరయ్యారు.
కాగా, డిసెంబర్ 1 నుంచి 19 వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ప్రజాభవన్‌లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి కీలక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



