నవతెలంగాణ చందుర్తి: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడేస్తాదో అని వేచిచూసిన వారికి కొందరికి అనుకూలం మరి కిందరికి కలసి రాకపోవడంతో వ్యాపారస్తులు వేత్తలు తమకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి లక్షల రూపాయలు ఇస్తామని ముందస్తుగా గ్రామ ముఖ్యుల తో సమావేశమవుతున్నారు.అదే ఇప్పుడు జరుగుతుంది. కట్ట లింగంపేట పంచాయతీ జనరల్ రావడంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ ప్రముఖ వ్యక్తులతో బుధవారం సమావేశం అయినట్లుగా కొందరి ద్వారా తెలిసింది.
పదిలక్షలు గ్రామానికి ఇస్తా?
తమకు అవకాశం ఇస్తే గ్రామానికి పది లక్షల రూపాయలు ఇస్తానని కరీంనగర్ లో ఉంటున్న ఓ వ్యాపారి కట్టలింగంపేటలో మకాం వేసి పలువురితో మంతనాలు జరువుతున్నట్లుగా సమాచారం. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు పైకి పచ్చ జండా ఊపి లోలోపల ఎర్రజెండా ఊపుతున్నారు. అంటే అయిష్టంగానే ఉన్నారని తెలుస్తుంది.
సన్నగిలకుతున్న అధికార ఆశావాహులు
స్థానిక ఎన్నికల్లో ఎప్పటి నుండో పోటీ చేయాలని ఆధికార పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ఎదిరి చూస్తున్న వారికి ఎదురు గాలిగా మారింది. గ్రామంలో స్థానికంగా ఉంటూ ప్రజా సేవలో ఉంటూన్న యువనాయకులకు ఒకేసారి అందుబాటులో లేని వ్యక్తి అనూహ్యంగా తెర పైకి రావడంతో ఆశావాహుల కు ఆశలు సన్నగిల్లుతున్నాయని సమాచారం. దీంతో గతంలో గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏక గ్రీవం చేసిన ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడ రాలేదని దీంతో ఓ వ్యక్తి గ్రామానికి డబ్బులు ఇస్తామని హామీ ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలువడంతో కొందరు నాయకులు ససేమిరా అన్నట్లుగా తెలిసింది.
కట్ట లింగంపేట ఏకగ్రీవానికి పంచాయతీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



