నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుళ విమానయాన సంస్థల్ని వెనిజులా విమానయాన సంస్థ బుధవారం నిషేధించింది. స్పెయిన్‌కు చెందిన ఐబిరియా, పోర్చుగల్‌కి చెందిన టిఎపి, కొలంబియాకు చెందిన అవియాంకా, చిలీ, బ్రెజిల్‌కు చెందిన ఎల్‌ఎటిఎఎం, బ్రెజిల్‌కు చెందిన జిఓఎల్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లు అమెరికా ప్రభుత్వం ప్రోత్సహించిన రాజ్య ఉగ్రవాద చర్యలలో చేరడం, ఏకపక్షంగా చేస్తున్న వైమానిక వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయడం కోసం ఆయా విమానయాన సంస్థల విమానాల రాకపోకల్ని, వాటి అనుమతుల్ని రద్దు చేస్తామని వెనిజులా పౌర విమానయాన అథారిటీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపింది.
కాగా, వెనిజులా మాదక ద్రవ్యాల్ని అక్రమంగా రవాణా చేస్తోందని అమెరికా ఆరోపిస్తుంది. ఈ చర్యకు వ్యతిరేకంగా కరేబియన్ సముద్రంలో వెనిజులా ఓడలపై సైనిక దాడికి పాల్పడింది. ఇకపై సైనిక దాడులు పెరిగే అవకాశం ఉందని వాషింగ్టన్ హెచ్చరించింది.



