నవతెలంగాణ – ఆత్మకూరు : కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం విభాగానికి చెందిన పరిశోధకురాలు ఎస్. స్వాతి “స్టేటస్ ఆఫ్ ఉమెన్స్ సానిటరీ వర్కర్స్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్న – ఏ స్టడీ ఆఫ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్” అనే విశయంపై పరిశోధన పూర్తి చేసి పిహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఈ పరిశోధన ప్రొఫెసర్ గోపు సుధాకర్ మార్గదర్శకత్వంలో పూర్తి కాగా, పట్టా లభించిన సందర్భంగా విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు, ఇతర ప్రొఫెసర్లు, విద్యార్థులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అదనపు కంట్రోలర్, సూపర్వైజర్ తదితరులు స్వాతిని అభినందించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ గ్రామానికి చెందిన ఎస్.స్వాతి(సవీరా) – సర్దార్. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ… మహిళా శానిటరీ కార్మికుల ఆర్థిక, సామాజిక సాధికారత మీద తన పరిశోధన సమాజానికి ఉపయోగపడుతుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుప డటానికి తోడ్పడే విధంగా ఈ అధ్యయనం దోహదం చేస్తుందని తెలిపారు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో స్వాతికి (సవేరా) డాక్టరెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



