నవతెలంగాణ-హైదరాబాద్: సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని.. 54 మంది కార్మికులు చనిపోయారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. ‘‘ఈ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటి? 237 మంది సాక్షులను విచారించినా దర్యాప్తులో పురోగతి లేదా? పేలుడు ఘటనకు ఇప్పటివరకు బాధ్యులను గుర్తించలేదా? పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారా?’’ అని ప్రశ్నించారు. ఈ ఘటనపై దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా సీజే ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఏఏజీని ఆదేశించారు. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరుకావాలన్నారు. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేశారు.
సిగాచీ పేలుడు ఘటన..దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



