Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట అవశేషాలు అగ్ని..!

పంట అవశేషాలు అగ్ని..!

- Advertisement -

వరికొయ్యకు నిప్పు పెట్టొద్దు

కలియదున్నితేనే ఎంతో మేలు

నవతెలంగాణ పెద్దవంగర:

ఓ రైతును చూసి, మరో రైతు పంట అవశేషాలను కాలబెడుతున్నారు. దీంతో భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. అవశేషాలను కాలబెట్టినప్పుడు వాతావరణంలోని కార్బన్డేయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్గా మారుతుంది. దీంతో పొగతో వాతావరణం కలుషిమవుతోంది. పొగతో శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. రైతులు కొయ్యకాళ్లను కాల్చకుండా.. రోటోవేటర్ తో కలియ దున్నితే భూమిలో కలిసిపోతుంది. దీంతో పెద్దగా రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గి, పంట దిగుబడి సైతం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

వరికొయ్యలు పంటకు ఎంతో మేలు

వరికొయ్యలు పంటకు ఎంతో మేలు చేస్తుంది. నేలలో వరికొయ్యలు కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 10 శాతం వరకు పెరిగే అవకాశముంది. దుక్కిదున్నే సమయంలో సూపర్‌ ఫాస్ఫేట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది. మొక్కలకు 2 శాతం నత్రజని(యూరియా), 4 శాతం పాస్పరస్‌ అదనంగా అందిస్తుంది. జింక్‌, మాంగనీస్‌, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి. నేలలో కరుగని మూలకాలను అనుకూలంగా మార్చుతుంది. నీటి నిల్వ పెరుగుతుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరం తో పాటు కొంత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరడంతో పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది.

కలియదున్నితేనే ఎంతో మేలు

రైతులు కొయ్యకాళ్లను కాల్చడం ద్వారా భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. పంట అవశేషాలు కలియ దున్ని.. ఎకరాకు మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లితే ఎరువుగా మారుతుంది. దీంతో రసాయనిక ఎరువులకు పెట్టే ఖర్చు 50 శాతం తగ్గి, దిగుబడి కూడా పెరుగుతుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి కొయ్యకు నిప్పు పెట్టొద్దు. సాగులో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

— గుగులోత్ స్వామి నాయక్ (ఏవో, పెద్దవంగర)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -