– సివిల్ సప్లై జిల్లా మేనేజర్ మహేందర్
– 6 వందల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నవతెలంగాణ -పరకాల : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ (డీఎం) మహేందర్ అధికారులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారం రోజుల్లోగా కొనుగోలు పూర్తిచేసి, చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
600 మెట్రిక్ టన్నుల సేకరణ
శుక్రవారం పరకాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఎం మహేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ధాన్యం సేకరణ వివరాలను ఆయన పరిశీలించారు. అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం, జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 600 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన తెలిపారు. అయితే, వర్షాలు పడే అవకాశం ఉన్నందున, మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, గోదాములకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, తేమశాతం నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని డీఎం మహేందర్ ఈ సందర్భంగా కోరారు. తాలు, మట్టి లేకుండా శుభ్రం చేసిన ధాన్యానికి తక్షణమే కొనుగోలు ఉంటుందని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, సంచుల (బస్తాలు) కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు డీఎం మహేందర్ దిశానిర్దేశం చేశారు. ఆయనతోపాటు పరకాల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , ఎఒ శ్రీనివాస్ పిఎసిఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



