నవతెలంగాణ–చౌటుప్పల్ రూరల్:
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జిఎఫ్ఐ) జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు యాదాద్రిభువనగిరి జిల్లా దండు మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఊదరి శ్రీజ ఎంపిక అయ్యారు. ఈమె డిసెంబర్ 17వ తేది నుండి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరిగే జాతీయస్థాయి అండర్ 17 తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టులో ఆడనుంది. ఇటీవల నవంబర్ 14,15,16 లలో నల్లగొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో శ్రీజ ఉత్తమ ఆటతో జాతీయ పోటీలకు ఎంపిక అయ్యింది.
శ్రీజ ఎంపిక పట్ల మండల విద్యాధికారి ఎలికట్టే గురవారావు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, పీడీ డాక్టర్ అన్నలూరి భావన, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతం నుండి జాతీయస్థాయికి ఎంపికైన శ్రీజకు ఆర్థిక ప్రోత్సాహం అందించవలసిందిగా క్రీడాభిమానులకు, దాతలకు, నాయకులను శ్రీజ విజ్ఞప్తి చేస్తుంది.



