మునుగోడులో అత్యధిక స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయం.
బీఆర్ఎస్ హయాంలోనే మునుగోడు నియోజవర్గం అభివృద్ధి జరిగినది.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…
నవతెలంగాణ మునుగోడు:
మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేశారు. గురువారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
హైదరాబాదులోని తమ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఉప సర్పంచ్ ఆకుల అనిల్ , కోనేటి నరసింహ, బండమీది సైదులు, చేన్నగోని సైదులు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోచేరిన వారి మాజీ ఉప సర్పంచ్ ఆకుల అనిల్, కోనేటి నరసింహ, బండమీది సైదులు, చేన్నగోని సైదులు ఉన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగినాదని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు పట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలిచే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు జనాల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా ఓడించే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నందిపాటి వెంకన్న, బోయ గాలయ్య, బోయ లింగస్వామి, చెనగోని కాటంరాజు, ఏనుగుల ముత్యాలు, వడ్డేపల్లి నరసింహ పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.



