Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నోడల్ అధికారులు విధులను పారదర్శకంగా నిర్వహించాలి…

నోడల్ అధికారులు విధులను పారదర్శకంగా నిర్వహించాలి…

- Advertisement -

– ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమి
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ :  గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను  సక్రమంగా నిర్వహిస్తు ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు  తావివ్వకుండ పారదర్శకంగా  సజావుగా నిర్వహించాలని   ఎన్నికల సాదారణ  పరిశీలకులు గౌతమి అన్నారు.

గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్సు హాలు నందు  జిల్లా కలెక్టర్ హనుమంత రావు, డిసిపి అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు   లతో  కలిసి గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యలు ,ఎన్నికల పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం : జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటి విడతకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి,  మాట్లాడారు.
అధికారులకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో నిర్వహించి వారికి ఎన్నికల నియమ నిబంధన ల పై అవగాహన కల్పించినట్లు తెలిపారు.  మొదటి విడుదల సమస్యత్మక గ్రామాలను గుర్తించి  ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ  ఏర్పాటు చేసినట్లు అందుకు పోలీస్ శాఖ సహకారం తీసుకొని ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అబ్జర్వర్ 24 గంటలు అందుబాటులో ఉంటారని ఏమైనా ఫిర్యాదులు ఉంటే అబ్జర్వర్ వరకు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -