– మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
నవతెలంగాణ -పెద్దవంగర: ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్, ఎడ్యుక్వెస్ట్ టాక్ పోటీ పరీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో మాట్లాడుతూ.. ఇలాంటి పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడుతాయన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి పోటీతత్వం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కాగా ఎడ్యుక్వెస్ట్ టాక్ సీనియర్స్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల చిట్యాల నుండి విద్యార్ధి రాపోలు రవి కీర్తన్, జూనియర్ విభాగంలో దేశెట్టి శరణ్య ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్ ఒలింపియాడ్ సీనియర్స్ విభాగంలో ను రాపోలు రవి కీర్తన్, జూనియర్స్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల అవుతాపురం విద్యార్థి వరుణ్ నిలిచారు. వీరికి ఎంఈవో ప్రశంసా పత్రాలు అందించి, అభినందించారు. కార్యక్రమంలో ఎల్టా మండల కన్వీనర్ శివకుమార్, డీకే వెంకటేశ్వర్లు, తఖీ పాషా, అంజయ్య, భాస్కర్, రాజలింగం, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



