Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..

నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..

- Advertisement -

నవతెలంగాణ-వెల్దండ : వెల్దండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆ గ్రామాలలో అధికారులు ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలలో గురువారం పలువురు నాయకులు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలాలు చేశారు. వెల్దండ మండల కేంద్రంలో బీసీ మహిళా రిజర్వేషన్ లో కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మండల నాయకులతో బుధవార్ పేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామపంచాయతీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఎమ్మెల్యే తో కలిసి సర్పంచ్ అభ్యర్థి యాదమ్మ వెంకటయ్య గౌడ్ అందజేశారు. అలాగే పెద్దాపూర్ ఎస్సీ మహిళా సర్పంచ్ స్థానానికి ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశమల్ల అనూష కృష్ణ , కొట్ర గ్రామానికి చెందిన షాంపూరి సంతోష అల్లాజీ తిమ్మినోని పల్లి నామినేషన్ సెంటర్లు ఎస్సీ మహిళా రిజర్వేశన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలాలు చేశారు. మండలంలో మొదటి రోజు సర్పంచు స్థానాలకు 19 మంది నామినేషన్లు వేయగా 17 వార్డు స్థానాలకు నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దండ గ్రామ మాజీ సర్పంచ్ యన్నo భూపతిరెడ్డి, ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు బస్సు రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్ , సురేందర్ రెడ్డి ,కృష్ణ ముదిరాజ్ ,రషీద్, ఎర్ర శ్రీను ముదిరాజ్, రమేష్ ,పురుషోత్తం చారి ,భరత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -