– వార్డు సభ్యులకు 134 నామినేషన్లు దాఖలు…
– జిల్లా అదనపు ఎన్నికల అధికారి వర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గురువారం రోజున ఆలేరులో మూడు గ్రామ పంచాయతీల నుంచి 4 నామినేషన్లు, రాజాపేట నుంచి 16, యాదగిరిగుట్ట నుంచి 31, ఆత్మకూర్ నుంచి 43 నామినేషన్లు, బొమ్మలరామారం నుంచి 33 నామినేషన్లు, తుర్కపల్లి నుంచి 49 నామినేషన్లు మొత్తం ఈరోజు 205 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
వార్డు మెంబర్లకు సంబంధించి ఆలేరులో 9 నామినేషన్లు, రాజపేటలో 21 నామినేషన్లు, యాదగిరిగుట్టలో 49 నామినేషన్లు, ఆత్మకూర్ 14 నామినేషన్లు, బొమ్మలరామారంలో ఏడు నామినేషన్లు, తుర్కపల్లిలో 34 నామినేషన్లు మొత్తంగా చూస్తే 134 వార్డ్ నెంబర్ కు నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.
మొదటిరోజు మొదటి విడత 205 సర్పంచ్ నామినేషన్లు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



