-వివరాలు వెళ్లడించిన ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ బద్యానాద్ చౌహాన్
-ఫామ్ హౌస్, ఫంక్షన్ హాల్స్ లో లిక్కర్ పార్టీలకు అనుమతులు లేవు
-సారా, బెల్లం అమ్మిన, వాటిని కలిగి ఉన్న బైండోవర్
-ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో బెల్టు షాపులపై కొరడా
నవతెలంగాణ-ఆమనగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సందర్భంగా అక్రమ మద్యం అమ్మకాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బద్యానాద్ చౌహాన్ తెలిపారు. గురువారం ఆమనగల్ పట్టణంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఉన్న ఫామ్ హౌస్, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్ లలో లిక్కర్ పార్టీలకు అనుమతులు లేవని వివరించారు. తప్పని పరిస్థితుల్లో మద్యం పార్టీలు నిర్వహించాల్సి వస్తే తప్పక అనుమతులు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సారా, దాని తయారీకి వినియోగించే బెల్లం, పట్టిక అమ్మినా, వాటిని నిల్వ ఉంచుకున్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆమనగల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరిని బైండోవర్ చేయడం జరుగుతుందని సీఐ బద్యానాద్ చౌహాన్ పేర్కొన్నారు.
ఎలక్షన్ కోడ్ అమలుతో..అక్రమ మద్యం అమ్మకాలపై “గట్టి నిఘా”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



