నవతెలంగాణ -పెద్దవంగర: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తొర్రూరు క్యాంపు కార్యాలయంలో మండలంలోని రామచంద్రు తండా మాజీ ఉప సర్పంచ్ జాటోత్ అమల దస్రు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మాజీ ఎంపీటీసీ రవీందర్ నాయక్, సీనియర్ నాయకులు జాటోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



