– పత్తి మిల్లులు సందర్శించిన రైతు సంఘం నాయకులు
– రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశా నాయక్
నవతెలంగాణ అచ్చంపేట: పత్తి కొనుగోలు సిసిఐ విధించిన ఆంక్షలు తొలగించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశనాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని హాజీపూర్ సిసిఐ పత్తి కొనుగోలు మిల్లులును రైతు సంఘం, సీపీఐ(ఎం), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశనాయక్ మాట్లాడుతూ… ఎలాంటి షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయాలని వారు కోరారు.
సీసీఐ కేంద్రంలో పత్తిని అమ్ముకోవడానికి అనేక నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులకి పనికొచ్చే కార్యక్రమాలు పెట్టకుండా రైతులకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం దుర్మార్గమని అన్నారు. రైతుల దగ్గర నుంచి ఒక ఎకరాకి 7 కింటాల్ మాత్రమే తీసుకుంటామనే నిబంధనని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటని పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల తేమ లేకపోవడం వల్ల రైతులు ఆందోళన ఉన్నారని గుర్తు చేశారు.
వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తేమ రాకపోవడంతో రైతులు పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో రైతన్నలు ఉన్నారని వారు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పునరా ఆలోచన చేసి తడిసిన పత్తిని పూర్తిస్థాయిలో రైతు దగ్గర పండించిన పత్తిని కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కిందిస్థాయిలో సర్కులర్ పంపాలని వారు కోరారు రైతుల దగ్గర పత్తులని కొనుగోలు చేయకపోతే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు శంకర్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్, సిపిఎం మండల కార్యదర్శి సైదులు, ఉప్పునుంతల మండల కార్యదర్శి నాగరాజు, శివ, బాలయ్య, నరేష్, జంగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు



