నవతెలంగాణ ఆర్మూర్
ఆలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, కల్లెడి లో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ , ఎంపీవో రాజలింగం కలిసి కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన ప్రాథమిక సదుపాయాలు, భద్రతా అంశాలు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో షెడ్లు, తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పోలింగ్ రోజు నిర్వహణలో ఎటువంటి లోపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, హెడ్మాస్టర్ మురళి, కరాబర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



