నవతెలంగాణ-హైదరాబాద్:దేశవ్యాప్తంగా రెండో విడత ఓటర్ల సమగ్ర సర్వే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లోని యూత్ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆందోళనలో భాగంగా గురువారం ఆ రాష్ట్ర రాజధాని భోపాల్ లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు బైటాయించారు. ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలంటూ ఆందోళనకారులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లాలని ప్రయత్నించారు. ముందస్తుగానే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డగించారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నిరసనకారులపై జల ఫిరంగులను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో ఇటీవల రాజస్థాన్‌లో కూడా యూత్ కాంగ్రెస్ శ్రేణులు సర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.




