Thursday, November 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం 

ముధోల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం 

- Advertisement -

– ప్రమాదంలో ఆరు లక్షల వరకు ఆస్తి నష్టం
నవతెలంగాణ -ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ లోని మజీద్ చౌక్ సమీపంలోగల గడ్డమొల్ల  రమేష్ అనే వ్యక్తి ఇల్లు గురువారం ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. బాదితుని కథనం ప్రకారం షాట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొనిఇంట్లో ఉన్న కిరాణా షాప్ కు సంబంధించిన సామాగ్రి  సుమారురెండు లక్షలు,  బీరువాలో ఉన్నకొంత నగదు తో  పాటు సుమారు రూ 4 లక్షల విలువ గలిగిన బంగారు నగలు  మొత్తం ఆరు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందనివాపోయారు. షార్ట్ సర్క్యూట్ వల్ల వ్యాపించిన మంటలను గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే స్పందించి వ్యాపించకుండా ప్రయత్నం చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంట్లో ఉన్న సిలిండర్ కు మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, ఆర్ఐ నారాయణ రావు పటేల్, జిపిఓ నర్సయ్య లు ప్రమాదానికి గల కారణాలపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లడంతో  ఆదుకోవాలని బాధితుడు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -