– ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఓ వెంకటరమణ
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : 7 వ చిన్న నీటి వనరుల గణన పై గురువారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో ఎన్యుమేరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఓ వెంకటరమణ హాజరై, మాట్లాడారు. కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి ఐదేళ్లకోసారి చిన్న తరహా నీటి వనరుల గణన 2000 హెక్టార్ల లోపు ఆయకట్టు గల వనరుల గణన చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏడవ చిన్న తరహా సాగునీటి వనరుల గణన స్మార్ట్ఫోన్లో యాప్ ద్వారా పూర్తిగా డిజిటల్ పద్ధతిన నిర్వహించడం జరుగుతుందన్నారు. తాసిల్దార్ ఆఫీసులో జిపిఓ లు డి ఆర్ డి ఓ లో పనిచేస్తున్న టెక్నికల్, అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఎన్ యు మై రైటర్ గా సర్వే చేస్తున్నారని తెలిపారు. తాసిల్దార్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ భరత్, డిప్యూటీ గణాంక అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, ఏపీవో బాలస్వామి, ఎంపీ ఎస్ఓ బాల నరసింహ పాల్గొన్నారు.
చిన్న నీటి వనరుల గణనపై ఎన్యుమేరేటర్లకు శిక్షణ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



