Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏసీబీ వలలో చిక్కిన మున్సిపల్ కమిషనర్ 

ఏసీబీ వలలో చిక్కిన మున్సిపల్ కమిషనర్ 

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ :  లంచాలకు అలవాటుపడ్డ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు.   మున్సిపల్ కమిషనర్ ఏ రాజు   యొక్క  డ్రైవర్ భూమేష్  గురువారం సాయంత్రం 20,000 లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు . కొత్తగా నిర్మించిన భవనానికి ఇంటి నంబర్ కేటాయించడానికి 20,000 లంచం డిమాండ్ చేసినారు.. డ్రైవర్ బ్యాగును తనిఖీ చేయగా, లంచం మొత్తానికి అదనంగా రూ. 4,30,000 లెక్కలో లేని నగదును ఏసీబీ అధికారులు కనుగొన్నారు. నిందితులను అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని  అదనపు ప్రత్యేక న్యాయమూర్తి, ప్రత్యేక కోర్టు యందు  హాజరు పరుస్తున్నట్టు ఏసీబీ డి.ఎస్.పి  శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ 1064ను సంప్రదించాలని , వాట్సాప్ నంబర్ (9440446106), ఫేస్బుక్ ( తెలంగాణ ఏసీబీ.) ఫిర్యాదు చేయవచ్చని  పేరు , వివరాలు గోప్యంగా  ఉంచబడునని తెలిపారు.

గత ఏప్రిల్ నెల 21వ తేదీ డివిజనల్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీనివాస్ శర్మ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా, గత ఆగస్టు 21వ తేదీ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి నీ ఎసిబి అధికారులు పట్టుకున్నారు. సరిగ్గా మూడు నెలల ఆరు రోజుల తర్వాత మున్సిపల్ కమిషనర్ సైతం ఏసీబీకి చిక్కగా  ప్రభుత్వ కార్యాలయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ సమయపాలన సైతం పాటించకుండా ఆడిందే ఆట… పాడిందే పాట.. అన్న చెందాగా విధులు నిర్వర్తించడం పట్ల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -