- Advertisement -
నవతెలంగాణ-మునుగోడు: మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆ గ్రామానికి చెందిన సురిగి నరసింహ గౌడ్ గురువారం ఆ గ్రామంలో నామినేషన్ ను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, కుంట్ల భీమారెడ్డి , ఎంజాల మధు , జాజెల్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



