Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శన 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శన 

- Advertisement -
  • ధాన్యం కొనుగోలు, రవాణా చేయు సందర్భంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి
  • ఎవరైనా నిర్లక్ష్యం అయితే సహించేది లేదు
  • జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

నవతెలంగాణ నెల్లికుదురు 

 మండలంలోని నెల్లికుదురు, మదనతుర్తి, ఎర్రబెల్లిగూడెం వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వాహకులకు తగు సూచనలు చేసినట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వహిస్తున్న రిజిష్టర్ లను శనివారం తాసిల్దార్ కోడి చింతల రాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో సరిపడా గన్ని బ్యాగులు, టార్పాలిన్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వాతావరణ మార్పు దృష్ట్యా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని సూచించారు,ప్రభుత్వ సూచించిన ప్రకారం రైతుల నుండి ధాన్యం సేకరించడం జరుగుతుందని రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు, ధాన్యం కొనుగోళ్లు, రవాణా చేయు సందర్భంలో కేంద్రాల నిర్వహకులు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్స్,  ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో ఉండాలన్నారు,గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఈ సంవత్సరం అధిక దిగుబడి ఉన్నందున అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు , తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుందని తెలిపారు,

క్లస్టర్ అధికారులు, తహసిల్దార్లు సంబంధిత కేంద్రాల వద్ద ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సందర్శిస్తూ డిమాండ్ కనుగుణంగా లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, 

వేసవి తీవ్రత నేపథ్యంలో కేంద్రాల వద్ద త్రాగునీరు సౌకర్యం కల్పించాలని, వైద్య సౌకర్యాలు ఓ ఆర్ ఎస్, తదితర మందులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు,

 అనంతరం ఎర్రబెల్లి గూడెం సబ్ సెంటర్ ని తనిఖీ చేశారు. సబ్ సెంటర్ లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరు, తనిఖీ చేసి ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రజలకు  ఓఆర్ఎస్ , మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఎండ తీవ్రత వడగాలుల పై అవగాహన కల్పించాలని సూచించారు, జిల్లా కేంద్రం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) , కె.వీరబ్రహ్మచారి, ధాన్యం కొనుగోళ్లపై అందుబాటులో ఉంటారని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఈ సమస్యలు వచ్చిన వెంటనే సంప్రదించాలని ఆయన కోరారు,  ఈ సందర్శనలో నెల్లికుదురు మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యానవన అధికారి జీనుగు మరియన్న, స్థానిక తహసిల్దార్ కె.రాజు, కేంద్రాల నిర్వాహకులు రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -